FIFA World Cup : సౌదీలో 2034 ఫిఫా వరల్డ్ కప్.. అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో అనౌన్స్

2034 ఫిఫా వరల్డ్ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో బుధవారం ప్రకటించారు.

Update: 2024-12-11 17:43 GMT

దిశ, స్పోర్ట్స్ : 2034 ఫిఫా వరల్డ్ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో బుధవారం ప్రకటించారు. 2030 ఎడిషన్‌ను స్పెయిన్, పోర్చుగల్, మొరాకో మరియు సౌత్ అమెరికన్ దేశాల్లో ఉమ్మడిగా నిర్వహించనున్నట్లు అనౌన్స్ చేశారు. ‘ఫుట్ బాల్‌ను మరిన్ని దేశాలకు తీసుకువస్తున్నాం. టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్య క్వాలిటీని దెబ్బతీయకూడదని భావిస్తున్నాం. 2030 ఫిఫా వరల్డ్ కప్ మూడు ఖండాలు, ఆరు దేశాల్లో నిర్వహిస్తాం. ఉరుగ్వే, అర్జెంటీనా మరియు పరాగ్వే వేడుక మ్యాచ్‌లను నిర్వహిస్తాయి.’ అని అయన అన్నారు. 2034 ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా సౌదీ అరేబియాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆ దేశ ఉన్నతాధికారులు తెలిపారు. మహిళలకు హక్కులు, స్వేచ్ఛకు ఇది ఎంతో దోహదపడనున్నట్లు వారు పేర్కొన్నారు. 

Tags:    

Similar News