దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 34.1 ఓవర్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి(76) రూపంలో టీమిండియా 10వ వికెట్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ఏకంగా ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న రోహిత్ సేన కల ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ప్రొటిస్ పేసర్లలో నండ్రీ బర్గర్ 4 వికెట్లతో చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. రబడ 2 వికెట్లు, మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు.