బౌండరీ లైన్ వద్ద ఐదేళ్ల పసివాడిని కాపాడిన విండీస్ కెప్టెన్.. పక్కకు దూకడంతో..
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐదేళ్ల పసివాడిని కాపాడడానికి విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అకీల్ హొస్సేన్ వేసిన బంతిని లాంగాఫ్ వైపుగా డీకాక్ బాదాడు. దీన్ని ఆపేందుకు రావ్‌మెన్ పావెల్ వేగంగా పరుగు తీశాడు. అయితే డైవ్ చేస్తే బంతి బౌండరీ వెళ్లకుండా ఆపే అవకాశం కనిపించింది. కానీ పావెల్ డైవ్ చేయలేదు. ఎందుకంటే బంతిని పట్టుకోవడానికి ఐదేళ్ల పసివాడు బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి ఉన్నాడు. తను డైవ్ చేస్తే.. ఆ పసివాడిని ఢీకొట్టడం ఖాయమని పావెల్‌కు అర్థమైంది. దీంతో డైవ్ చేయకుండా పరుగును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే చాలా వేగంగా వస్తుండటంతో అతను పూర్తిగా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే పిల్లవాడికి తగల కుండా పసివాడి పై నుంచి ముందుకు దూకాడు.
ఈ క్రమంలో వెనుక ఉన్న ఎల్‌ఈడీలను బలంగా తాకాడు. అక్కడితో ఆగకుండా వాటి పై నుంచి అవతలకు వెళ్లి.. అక్కడ ఉన్న స్టీల్ పైపులను కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ గాయంతో పావెల్ వెంటనే మైదానంలోకి రాలేకపోయాడు. బౌండరీ లైన్ పక్కనే పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. జట్టు ఫిజియోలు వచ్చి అతనికి చికిత్స అందించగా.. కాసేపటికి తేరుకున్న అతను మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కూడా చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో విజయం మాత్రం సౌతాఫ్రికానే వరించింది.
SPIRIT OF CRICKET - Rovman Powell puts his body on the line and nearly injures himself instead of crashing into two little ball boys. Top humanitarian effort by the WI Captain! pic.twitter.com/KNNWcR5Jpg
— Israr Ahmed Hashmi (@IamIsrarHashmi) March 26, 2023