క్రికెట్ కిట్ కోసం రోహిత్ శర్మ పాల ప్యాకెట్లు అమ్మిండు : ప్రజ్ఞాన్ ఓజా

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, మాజీ టీమ్ ఇండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Update: 2023-03-28 14:03 GMT

ముంబై : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, మాజీ టీమ్ ఇండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాజాగా జియో సినిమా యాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా మాట్లాడుతూ.. మిడిల్‌క్లాస్ కుటుంబంలో పుట్టిన రోహిత్ శర్మను ఈ స్థాయిలో చూస్తుండటం గర్వంగా ఉందన్నాడు. ‘అండర్‌-15 నేషనల్‌ క్యాంపులో తొలిసారి రోహిత్‌ శర్మను కలిసాను. అతనో స్పెషల్ ప్లేయరని అక్కడి ఉన్నవారంతా చెప్పారు. ఆ క్యాంప్‌లో అతనికి ప్రత్యర్థిగా ఆడిన నేను రోహిత్‌ను అవుట్ చేశాను. రోహిత్ శర్మ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ, ఆడేటప్పుడు చాలా దూకుడుగా ఉండేవాడు. ఆ తర్వాత మా మధ్య స్నేహం మొదలైంది.

అతను మిడిల్‌క్లాస్ కుటుంబం నుంచి వచ్చాడు. అప్పుడు అతను చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. క్రికెట్‌ కిట్ల బడ్జెట్ గురించి మాట్లాడితే రోహిత్ భావోద్వేగానికి గురయ్యేవాడు. పాల ప్యాకెట్లు వేసి అలా వచ్చిన డబ్బులతో అతను క్రికెట్ కిట్ కొనేవాడు. అందుకే అతన్ని ఇప్పుడు చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది.’ అని ఓజా చెప్పుకొచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో రోహిత్ చాలా సరదాగా ఉంటాడని, ప్రాంక్స్ చేస్తూ అందరినీ ఆటపట్టించేవాడని తెలిపాడు. కాగా, ఐపీఎల్ తొలి సీజన్‌లో డెక్కన్ చార్జర్స్‌ తరఫున రోహిత్, ఓజా కలిసి ఆడారు. ఆ తర్వాతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరూ.. 2013, 2015లో ముంబై జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.

Tags:    

Similar News