ఆ క్రికెట్ ఆడే అర్హత అశ్విన్‌కు లేదు : యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Update: 2024-01-14 15:09 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆడేందుకు అశ్విన్‌కు అర్హత లేదని వ్యాఖ్యానించాడు. ‘అశ్విన్ గొప్పు బౌలర్.. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ, వన్డే, టీ20ల్లో ఆడేందుకు అతనికి అర్హత లేదు. బంతితో రాణిస్తాడు. కానీ, బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా అతను ఏం చేయగలడు?. టెస్టులో టీంలో మాత్రం అతను ఉండాల్సిందే.’ అని యువీ చెప్పుకొచ్చాడు.

అలాగే, భారత మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై కూడా యువీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌లో జాబ్ కోసం అడిగితే నెహ్రా తిరస్కరించాడని చెప్పాడు. ‘జాబ్ కావాలని ఆశిష్ నెహ్రాను అడిగాను. కానీ, అతను తిరస్కరించాడు. ప్రస్తుతం పిల్లలే నా ప్రాధాన్యత. వాళ్లు స్కూల్‌కు వెళ్తే నాకు సమయం దొరుకుతుంది. నాకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయో చూద్దాం. మెంటార్‌గా ఉండాలని అనుకుంటున్నా. యువ క్రికెటర్లతో కలిసి పనిచేయాలని ఉంది. క్రికెట్‌ నాకు ఇచ్చింది తిరిగి ఇవ్వాలని ఉంది. యువకులను మెరుగుపర్చాలనుకుంటున్నా. భవిష్యత్తులో ఐపీఎల్‌లోని జట్లలో ఏదో ఒక దానిలో కచ్చితంగా భాగమవుతాను.’ అని యువరాజ్ సింగ్ తెలిపాడు. 

Tags:    

Similar News