ఇవాళ IPL లో రెండు మ్యాచ్ లు.. కొత్త జెర్సీతో బరిలోకి RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 ) ఇవాళ సూపర్ సండే మ్యాచ్ లు జరగనున్నాయి.

Update: 2025-04-13 02:19 GMT
ఇవాళ IPL లో రెండు మ్యాచ్ లు.. కొత్త జెర్సీతో బరిలోకి  RCB
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 ) ఇవాళ సూపర్ సండే మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించబోతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Rajasthan Royals vs Royal Challengers Bangalore ) మధ్య జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగనుంది. జైపూర్ లోని సవాయి మన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది.

అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆడే మ్యాచ్ లో కొత్త జెర్సీ ధరించి బరిలోకి. గతంలో తరహాలోనే గ్రీన్ కలర్ జెర్సీతో ( Green color jersey ) మైదానంలోకి దిగనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ జెర్సీని ప్రతి సంవత్సరం ఒక మ్యాచ్ లో బెంగళూరు ధరిస్తుంది. ఇది ఫ్రాంచైజీ విస్తృతమైన స్థిరత్వ కార్యక్రమాలను హైలెట్ చేస్తూ ఉంటుంది.

పర్యావరణం రక్షించడం, వీలైనన్ని చెట్లను నాటడం లక్ష్యంగా ఈ జెర్సీని ధరిస్తున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు. ఇక రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News