రెండో రౌండ్‌లో నదాల్ ఓటమి

బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో 22 గ్రాండ్‌స్లామ్స్ విజేత, స్పెయిన్ దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నదాల్ రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.

Update: 2024-04-17 18:59 GMT
రెండో రౌండ్‌లో నదాల్ ఓటమి
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్‌లో జరుగుతున్న బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో 22 గ్రాండ్‌స్లామ్స్ విజేత, స్పెయిన్ దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నదాల్ రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ టోర్నీతోనే పునరాగమనం చేసిన అతను తొలి రౌండ్‌లో విజయం అందుకున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో నదాల్ 5-7, 1-6 తేడాతో 4వ సీడ్, ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ డి మినార్ చేతిలో ఓడిపోయాడు. పోరాటం చేసి తొలి సెట్ కోల్పోయిన నదాల్ రెండో సెట్‌లో పూర్తిగా తేలిపోయాడు. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో నదాల్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 12 సార్లు టైటిల్ గెలుచుకున్నాడు. చివరిసారిగా 2021లో విజేతగా నిలిచాడు. 

Tags:    

Similar News