పారిస్ పారాలింపిక్స్‌కు షూటర్ మోనా అగర్వాల్‌ అర్హత

భారత పారా షూటర్ మోనా అగర్వాల్ ఈ ఏడాది జరగబోయే పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది.

Update: 2024-03-09 16:31 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత పారా షూటర్ మోనా అగర్వాల్ ఈ ఏడాది జరగబోయే పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఢిల్లీలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో ఆమె గోల్డ్ మెడల్‌ సాధించి ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌ఎచ్1 కేటగిరీలో మోనా అగర్వాల్ 250.7 స్కోరుతో స్వర్ణం పతకం గెలుచుకుంది. మరో భారత పారా షూటర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అవనీ లేఖరా 227 స్కోరుతో కాంస్య పతకం సాధించింది. ఫైనల్‌కు ముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో అవనీ లేఖరా 623.9 స్కోరుతో 4వ స్థానంలో నిలువగా.. మోనా అగర్వాల్ 618 స్కోరుతో 7వ స్థానంలో నిలిచింది. ఫైనల్‌లో మోనా పుంజుకుని విజేతగా నిలిచి ఈ టోర్నీలో భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. అలాగే, పీ3-25 మీటర్ల పిస్టోల్ మిక్స్‌డ్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో వికాశ్ భటివాల్, నిహాల్ సింగ్, రాహుల్ జఖర్ జట్టు రజత పతకం సాధించింది. 

Tags:    

Similar News