Champions Trophy: తగ్గిన పాకిస్తాన్.. తీసుకున్న కీలక నిర్ణయం

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) వివాదం ప్రపంచ క్రికెట్(Cricket) ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తోంది.

Update: 2024-11-30 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) వివాదం ప్రపంచ క్రికెట్(Cricket) ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తోంది. తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్‌ పద్ధతికి అంగీకరించాలని, లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని పాక్‌కు ఐసీసీ(ICC) అల్టిమేటం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఐసీసీ విధించిన నిబంధనను పాక్ అంగీకరించింది.

హైబ్రిడ్ మోడ్‌(Hybrid mode)లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. కానీ, ఫైనల్ లాహోర్‌(Lahore)లోనే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. భవిష్యత్‌లో ఏ టోర్నమెంట్ అయినా భారత్‌లో ఆడాల్సి వస్తే.. తాము కూడా హైబ్రిడ్‌ మోడ్‌లోనే ఆడతామని పాక్‌ స్పష్టం చేసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఈరోజు లేదా రేపు ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎనిమిది జట్లతో కూడిన ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుంది.

Tags:    

Similar News