ఆరెంజ్ క్యాప్ హ్యారీ బ్రూక్‌కే: ఇంగ్లాండ్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకునే సత్తా హ్యారీ బ్రూక్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిసన్ అన్నాడు.

Update: 2023-03-30 04:04 GMT

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకునే సత్తా హ్యారీ బ్రూక్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిసన్ అన్నాడు. హ్యారీ చేరికతో సన్ రైజర్స్ జట్టు మరింత బలోపేతమైందని అన్నాడు. ఓ తుఫానుల ఐపీఎల్ లో అతను విధ్వంసం సృష్టించబోతున్నాడని హర్మిసన్ జోస్యం చెప్పాడు. 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ ను వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.

ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మిసన్ మాట్లాడుతూ.. 'హ్యారీ ఆరెంజ్ క్యాప్‌తో టోర్నమెంట్ ను ఆరంభిస్తాడని నేను భావిస్తున్నా. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టు మిడిల్ ఆర్డర్ లో అతని దూకుడు అనన్య సామాన్యం. బ్రూక్ పరిమిత ఓవర్ల గణాంకాలు.. రెడ్ బాల్ గణాంకాలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం జట్టు రీత్య కిట్ లో ఆరెంజ్ ఉన్నందున.. ఆరెంజ్ క్యాప్ అతని సొంతం' అంటూ హర్మిసన్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News