వినేశ్ ఫొగాట్ 'అప్పీల్' పై.. 'తీర్పు' వాయిదా !
పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేశ్ ఫొగాట్ పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. ఈ అనర్హతను సవాల్ చేస్తూ.. వినేశ్ చేసిన అభ్యర్ధనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) స్వీకరించింది.
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేశ్ ఫొగాట్ పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. ఈ అనర్హతను సవాల్ చేస్తూ.. వినేశ్ చేసిన అభ్యర్ధనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) స్వీకరించింది. అయితే దీనిపై తీర్పు ఇవాళ వస్తుందని అంతా భావించారు. కానీ తీర్పును క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు ఆగస్టు 11 కు వాయిదా వేసింది. 100 గ్రాముల అదనపు బరువు ఉందనే కారణంగా అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్.. తనకు రజత పతకం ఇవ్వాలని సీఏఎస్ కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ తీర్పు వినేశ్ కు అనుకూలంగా వస్తే మాత్రం.. ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది.