కొత్త జెర్సీ వచ్చేసింది. టీమిండియా న్యూ జెర్సీ ఆవిష్కరణ
టీమిండియా ఆటగాళ్లు త్వరలోనే కొత్త జెర్సీలో కనిపించబోతున్నారు.
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా ఆటగాళ్లు త్వరలోనే కొత్త జెర్సీలో కనిపించబోతున్నారు. కొత్త జెర్సీని బీసీసీఐ సెక్రెటరీ జై షా, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ శుక్రవారం ఆవిష్కరించారు. అయితే, పాత జెర్సీతో పోలిస్తే పెద్దగా మార్పులు ఏం చేయలేదు.జెర్సీతో మొత్తం లైట్ బ్లూతో ఉంది. ఒక్క మార్పు మాత్రమే చేశారు. భుజాలపై తెల్ల స్ట్రిప్స్‌తోపాటు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. వచ్చే నెలలో విండీస్ పర్యటనలో భారత మహిళల జట్టు తొలిసారిగా ఈ కొత్త జెర్సీని ధరించనుంది.
📍 BCCI Headquarters, Mumbai
— BCCI (@BCCI) November 29, 2024
Mr Jay Shah, Honorary Secretary, BCCI & Ms Harmanpreet Kaur, Captain, Indian Cricket Team unveiled #TeamIndia's new ODI jersey 👏 👏@JayShah | @ImHarmanpreet | @adidas pic.twitter.com/YujTcjDHRO
‘కొత్త జెర్సీని ముందుగా ధరించబోతున్నందుకు గర్వంగా ఉంది. జెర్సీ లుక్ నాకు నచ్చింది. భుజాలపై మూడు రంగులు ఉండటం అందంగా ఉంది.’అని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. గతేడాది అడిడాస్ను కిట్ స్పాన్సర్‌గా తీసుకున్నప్పటికీ నుంచి టీమిండియా ఎప్పటికప్పుడు జెర్సీని అప్డేట్ చేస్తోంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత జట్టు ప్రత్యేకమైన జెర్సీలను ధరించింది. అలాగే, టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం ముంబైలో విజయయాత్ర కోసం కూడా భారత ఆటగాళ్లు ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీని ధరించారు.