నిజం కాదు.. విరుష్క విషయంలో ఏబీ డివిలియర్స్ యూ టర్న్

సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ డివిలియర్స్ కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విరాట్, అనుష్క దంపతులు రెండో బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నరాని తెలిపాడు.

Update: 2024-02-09 07:47 GMT

దిశ, స్పోర్ట్స్: సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ డివిలియర్స్ కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విరాట్, అనుష్క దంపతులు రెండో బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నరాని తెలిపాడు. ఒక్కరోజులోనే.. విరుష్క సంతానంపై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. విరుష్కపై ఫేక్ న్యూస్ ప్రచారం చేశానని.. మాట మార్చాడు. యూట్యూబ్ లో కోహ్లీ వ్యక్తిగత విషయాలు మాట్లాడి తప్పు చేశానన్నారు.

విరుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. కోహ్లి తల్లి సరోజ్ అనారోగ్యానికి గురైందని ప్రచారం జరగగా.. దాన్ని కొట్టి పారేశాడు విరాట్ సోదరుడు వికాస్. ఇలాంటి టైంలో తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిని ఏబీడీ.. విరుష్క రెండో బిడ్డకు జన్మనిస్తున్నారని కామెంట్స్ చేశాడు. కాగా.. ఆ న్యూస్ అసత్యమని పేర్కొన్నాడు ఏబీడీ.

వాస్తవానికి క్రికెట్ కంటే కుటుంబమే ప్రాధాన్యంమని.. తన యూట్యూబ్ ఛానెల్ లో విరాట్ గురించి మాట్లాడి తప్పుచేశానని ఒప్పుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలని పేర్కొన్నాడు. గేమ్ నుంచి బ్రేక్ ఎందుకు తీసుకున్నాడో తెలియదని.. తిరిగి ఉత్సాహంగా జట్టులో చేరాలని ఆశిస్తున్నట్లు తెలిపారు

మరోవైపు ఇంగ్లాండ్ తో జరిగే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు కోహ్లీ. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. కాగా.. మిగతా మూడు టెస్టు మ్యాచ్ లకు విరాట్ అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈనెల 15న రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్- భారత్ మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News