సిక్సర్లతో రెచ్చిపోయిన వెస్టిండీస్ ప్లేయర్.. సూర్య రికార్డ్ బ్రేక్

టీ20 క్రికెట్‌లో భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సంచలనాలకు కేరాఫ్ గా మారాడు.

Update: 2024-08-24 13:11 GMT

దిశ, వెబ్ డెస్క్: టీ20 క్రికెట్ లో భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సంచలనాలకు కేరాఫ్ గా మారాడు. గ్రౌండ్ ఏదైన.. బౌలర్ ఎవరైన తన దైన షాట్లతో సిక్సర్లు బాదుతూ.. భారీ స్కోర్ చేస్తూ రికార్డుల్లోకి ఎక్కాడు. తాజాగా సూర్య రికార్డులను వెస్టిండీస్ ప్లేక్ నికోలస్ పూరన్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచుల్లో పూరన్ రెచ్చిపోయాడు. 26 బంతుల్లో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. దీంతో పూరన్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో చేరాడు. కాగా ఈ జాబితాలో ఉన్న బట్లర్(137), సూర్యకుమార్ యాదవ్(139), మ్యాక్స్‌వెల్(134) లను వెనక్కి నెట్టిన పూరన్ 139 సిక్సర్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలలో రోహిత్ శర్మ 205 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా.. గప్టిల్ 173 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే పూరన్ టీ20లో 250 అత్యధిక స్ట్రైక్ రేటుతో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా నిలవగా మొదటి స్థానంలో జాన్సన్ 265.38 స్ట్రైక్ రేటుతో మొదటి స్థానంలో ఉన్నాడు.


Similar News