ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా..!

2023 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డేల్లో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.

Update: 2023-09-18 05:53 GMT
ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : 2023 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డేల్లో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు నలుగురు ఉన్నారు వారెవరో చూద్దాం.

1. చమిందా వాస్

2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే నలుగురు బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు చేర్చాడు. వారిలో హన్నన్ సర్కార్, మహ్మద్ అష్రాఫుల్, ఎహ్సానుల్ హక్, సనువార్ హొస్సేన్ ఉన్నారు. తొలి ముగ్గురు హ్యాట్రిక్‌ వికేట్లు కాగా, ఐదో బంతికి హొస్సేన్ వికెట్లను పడగొట్టాడు చమిందా వాస్.

2. మహ్మద్ సమీ

డిసెంబర్ 1, 2003న, పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ సమీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో తన వ్యక్తిగత అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పీడ్‌స్టర్ కేవలం 10 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. 36వ ఓవర్‌లో అతడు జాకబ్ ఓరమ్, టామా కానింగ్, డేనియల్ వెట్టోరి, పాల్ హిచ్‌కాక్‌ల వికెట్లను పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు.

3. లసిత్ మలింగ

2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు. మలింగ్ ఔట్ చేసిన వారిలో జాక్వెస్ కల్లిస్, షాన్ పొల్లాక్, ఆండ్రూ హాల్, మఖాయా ఎన్తినీ ఉన్నారు. మలింగ అద్భుతంగా బౌల్ చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి చవిచూసింది.

4. ఆదిల్ రషీద్

వెస్టిండీస్ తో గ్రెనడాలో జరిగిన నాలుగో వన్డేలో స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ తన అసాధారణ బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రషీద్ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్‌వైట్‌, దేవేంద్ర బిషూ, ఒషానే థామస్‌లను వరుస డెలివరీల్లో పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News