ఇండియా vs పాకిస్తాన్: టాస్ గెలిచిన భారత్..
వన్డే ప్రపంచకప్ 2023 లో భాగంగా 12 వ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా 12 వ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. వరల్డ్ కప్‌లోనే అత్యంత ఆధరన ఉండో ఈ మ్యాచ్ ప్రపంచలోనే అత్యంత పెద్దదైన నరేంద్రమోడీ స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఏడు సార్లు ఇరు జట్లు తలపడగా భారత్ ఏడింటిలో విజయం సాధించి పాకిస్తాన్ పై విజయ విహారాన్ని కొనసాగించింది. కాగా కనీసం ఈ మ్యాచ్ లో అయిన విజయం సాధించి భారత్ విజయపరంపరకు అడ్డుకట్ట వేయాలని పాకిస్తాన్ వేచి చూస్తుంది. కాగా ఈ మ్యాచ్‌లో మొదటి రెండు మ్యాచులకు దూరం అయినా శుభ్‌మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్ జట్టులో స్థానం కోల్పోయాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్