Nitish Kumar Reddy : నాన్న కన్నీళ్లే క్రికెట్ జర్నీకి స్ఫూర్తి : నితీశ్ రెడ్డి

నాన్న కన్నీళ్లే తన క్రికెట్ ప్రయాణానికి స్ఫూర్తి అని భారత యువ ఆటగాడు నితీశ్ రెడ్డి అన్నాడు.

Update: 2024-12-06 13:08 GMT

దిశ, స్పోర్ట్స్ : నాన్న కన్నీళ్లే తన క్రికెట్ ప్రయాణానికి స్ఫూర్తి అని భారత యువ ఆటగాడు నితీశ్ రెడ్డి అన్నాడు. తొలినాళ్లలో క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోలేదన్నాడు. శుక్రవారం బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియోలో నితీశ్ రెడ్డి మాట్లాడాడు. ‘తన ఈ ప్రయాణం వెనుక నాన్న చేసిన త్యాగం ఉంది. నా కెరీర్ కోసం జాబ్ వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులతో నాన్న ఏడవడం చూశాను. ఆ సమయంలో క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకున్నాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ రోజు మా నాన్న సంతోషంగా ఉండటాన్ని చూసి గర్వపడుతున్నాను. నా ఫస్ట్ జర్సీని నాన్నకు ఇచ్చి తన ఆనందాన్ని కళ్లారా చూశాను.’ అన్నాడు. ‘కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని. తను ఆడే ప్రతి మ్యాచ్ చూసేవాడిని. సెంచరీ కొట్టినప్పుడు విరాట్ చేసుకునే సెలబ్రేషన్స్ అంటే ఇష్టం. కోహ్లీ రిటైర్ కాకముందే భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలని నా వయసును లెక్కించుకునేవాడిని. ఇప్పడు కోహ్లీతో ఆడే అవకాశం వచ్చింది. పెర్త్‌లో కోహ్లీ సెంచరీ చేయడాన్ని ఆస్వాదించాను. కేఎల్ రాహుల్ ఇచ్చిన సలహాలు మంచి ఫలితాన్నిచ్చాయి.’ అని నితీశ్ రెడ్డి అన్నాడు. 

Tags:    

Similar News