న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నయ్ సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ కొత్త హెయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. చాలా రోజుల తర్వాత లాంగ్ హెయిర్ పెంచుకున్న అతను.. చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ధోనీ తన హెయిర్ స్ట్రైల్పై స్పందించాడు. ‘ఇలాంటి హెయిర్ స్ట్రైల్‌ను కొనసాగించడం చాలా కష్టం. ఇంతకుముందు యాడ్ ఫిల్మ్‌ల కోసం వెళ్లినప్పుడు మేకప్‌తోపాటు అన్నింటికి 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు మాత్రం గంటకు పైనే పడుతోంది. అంతసేపు కుర్చీలో కూర్చోని ఉండటం చాలా బోరింగ్‌గా ఉంది. ఈ లుక్ అభిమానులకు నచ్చింది.. కాబట్టి, వాళ్ల కోసం కొన్ని రోజులు కొనసాగిస్తా. కానీ, ఏదో ఒక రోజు మారుస్తా.’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ వచ్చే సీజన్ కోసం ధోనీ సిద్ధమవుతున్నాడు. మరోవైపు, 2024 సీజనే అతనికి చివరిదంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందిస్తూ.. తనకు తెలియదని, ధోనీ మాత్రమే దానికి సమాధానమిస్తాడని చెప్పాడు.