రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ఆ ప్రతిష్టాత్మక స్టేడియంలోని స్టాండ్‌కు హిట్‌మ్యాన్ పేరు

Update: 2025-04-15 16:00 GMT
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ఆ ప్రతిష్టాత్మక స్టేడియంలోని స్టాండ్‌కు హిట్‌మ్యాన్ పేరు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలోని రోహిత్ శర్మ పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నిర్ణయించింది. మంగళవారం జరిగిన ఎంసీఏ వార్షిక సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దివేచా పెవిలియన్ లెవల్ 2 స్టాండ్‌కు రోహిత్ పేరు పెట్టనున్నారు.

కెప్టెన్‌గా, ప్లేయర్‌గా భారత క్రికెట్‌ ఉన్నతికి రోహిత్ దోహదపడుతున్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు గతేడాది టీ20 వరల్డ్ కప్, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ సాధించిన విషయం తెలిసిందే. ఎం.ఎస్ ధోనీ తర్వాత ఒక్కటి కంటే ఎక్కువ ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత కెప్టెన్ రోహితే. ఎంసీఏ నిర్ణయంతో రోహిత్ భారత దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, విజయ్ మర్చంట్ వంటి దిగ్గజ ప్లేయర్లతో స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోహిత్ పేరిట స్టాండ్ ఏర్పాటు చేయబోతున్నారు. రోహిత్‌తోపాటు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, మాజీ ఎంసీఏ చీఫ్ శరద్ పవార్‌ల పేర్లతో కూడా స్టాండ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, స్టేడియంలోని లాంజ్‌కు ఎంసీఏ మాజీ ప్రెసిడెంట్ అమోల్ కాలే పేరు పెట్టాలని ఎంసీ నిర్ణయించింది.


Tags:    

Similar News