షూటర్ మహేశ్వరికి ఒలింపిక్స్ కోటా

భారత షూటర్ మహేశ్వరి చౌహాన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

Update: 2024-04-28 16:00 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత షూటర్ మహేశ్వరి చౌహాన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దోహాలో జరుగుతున్న షాట్‌గన్ ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ చాంపియన్‌షిప్‌‌లో ఆదివారం స్కీట్ విభాగంలో ఆమె రజతం గెలుచుకుని ఒలింపిక్స్ కోటాను పొందింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో మహేశ్వరి 121 స్కోరు చేసి జాతీయ రికార్డు నెలకొల్పింది. 4వ స్థానంలో ఫైనల్‌కు చేరుకున్న ఆమె తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. ఫైనల్‌లో చిలీ షూటర్ ఫ్రాన్సిస్కా క్రోవెట్టొ చాడిడ్‌తో కలిసి మహేశ్వరి 54 స్కోరుతో సమంగా నిలిచింది. దీంతో షూటౌట్ నిర్వహించగా అక్కడ మహేశ్వరి 3-4తో ఓడి రజతంతో సరిపెట్టింది. చాడిడ్‌ ఇప్పటికే పారిస్ క్రీడలకు అర్హత సాధించడంతో మహేశ్వరికి ఒలింపిక్స్ కోటా దక్కింది. షూటింగ్‌లో భారత్‌కు ఇది 21 ఒలింపిక్స్ కోటా. షాట్‌గన్‌లో ఐదవది. పురుషుల స్కీట్ కేటగిరీతోపాటు పురుషుల, మహిళల ట్రాప్ విభాగాల్లో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కోల్పోయింది. 

Tags:    

Similar News