ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. విరాట్, రోహిత్ ర్యాంకులు డౌన్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ర్యాంకులు భారీగా పడిపోయాయి.

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ర్యాంకులు భారీగా పడిపోయాయి. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఫలితంగా టెస్ట్ బ్యాట్స్‌మెన్ల జాబితాలో 14 వ స్థానంలో ఉన్న కోహ్లీ 20వ స్థానానికి పడిపోయాడు. పెర్త్‌లో సెంచరీ చేసి రాణించిన కోహ్లీ అడిలైడ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 7,11 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ తొమ్మిది స్థానాలు పడిపోయి 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. భారత ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్ 9, శుభ్‌మన్ గిల్ 17వ స్థానంలో కొనసాగుతున్నారు.
నెంబర్.1 బౌలర్‌గా బుమ్రా
పెర్త్ టెస్ట్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో రాణించి.. అడిలైడ్ టెస్ట్‌లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటిన బుమ్రా ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 5 బౌలర్స్‌లలో భారత స్పిన్ బౌలర్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి ప్యాట్ కమ్మిన్స్ 4వ స్థానానికి చేరుకున్నాడు. కమ్మిన్స్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడంతో ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు.