దిశ, వెబ్‌డెస్క్: లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ హిస్టరీ క్రియోట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ టెస్ట్‌ల్లో 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా 11వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఇంగ్లండ్ తరఫున వేగవంతంగా 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్న అలిస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు కుక్‌కు 252 ఇన్నింగ్స్‌లు ఆడగా.. రూట్ 232 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ 11,000 రన్స్ రికార్డు కుమార సంగక్కర (208 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది.
11,000 Test runs ✅
— ICC (@ICC) June 2, 2023
A magnificent achievement for Joe Root 🙌#ENGvIRE | 📝: https://t.co/x2U3qVAiwW pic.twitter.com/Pce2O9xZRa