దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌పై ఆసీస్ మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ ఒలిపింక్స్‌తో సమానమని లాంగర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఆండీ ప్లవర్ స్ధానాన్ని లంగర్‌తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. లంగర్‌కు కోచ్‌గా అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్ తొలి టీ20 వరల్డ్‌కప్(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్‌లో కూడా లంగర్ కోచ్‌గా విజయవంతమయ్యాడు. ఐపీఎల్ అనేది ఒలింపిక్స్ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రతీ మ్యాచ్ ఒక అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు ఆదరణ ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.