అలాంటి ప్లేయర్లపై రెండేళ్ల బ్యాన్.. బీసీసీఐ నిర్ణయానికి ఇర్ఫాన్ పఠాన్ మద్దతు

ఐపీఎల్ వేలంలో ఎంపికైన తర్వాత లీగ్‌కు అందుబాటులో ఉండని క్రికెటర్లపై బీసీసీఐ రెండేళ్లపాటు నిషేధం విధించనుంది.

Update: 2024-09-29 14:24 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో ఎంపికైన తర్వాత లీగ్‌కు అందుబాటులో ఉండని క్రికెటర్లపై బీసీసీఐ రెండేళ్లపాటు నిషేధం విధించనుంది. గతంలో విదేశీ ప్లేయర్లు వేలంలో ఎంపికైన తర్వాత పలు కారణాలతో టోర్నీకి దూరమైన నేపథ్యంలోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతు ఇచ్చాడు. ఐపీఎల్‌కు ఇది మేలు చేస్తుందని చెప్పాడు. ఆదివారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘రెండేళ్లుగా నేను దీని గురించే మాట్లాడుతున్నా. బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. వేలంలో ఎంపికైన తర్వాత అందుబాటులో ఉండకపోతే ఆ ప్లేయర్లు ఇకపై రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటారు. ఈ నిర్ణయం ద్వారా ఎన్నో విధాలుగా ఐపీఎల్ బలపడుతుంది.’ అని రాసుకొచ్చాడు. 

Tags:    

Similar News