Asia Cup 2023: షకీబ్, హృదయ్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ ఇదే

ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌

Update: 2023-09-15 13:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బ్యాటర్స్‌లో.. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగులతో రాణించగా.. తోహిద్ హృదయ్ (54), నసుమ్ అహ్మద్ (44) పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లలో తంజీమ్ హసన్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేయగా.. మహెదీ హసన్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఓ వికెట్ తీశారు.


Similar News