IND vs AUS PM XI : వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షార్పణం.. రేపైనా ఆట సాగేనా?
భారత్, ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ మధ్య రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షార్పణమైంది.
దిశ, స్పోర్ట్స్ : భారత్, ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ మధ్య రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షార్పణమైంది. కాన్‌బెర్రా వేదికగా జరగాల్సి మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలింది. వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే శనివారం తుడిచిపెట్టుకుపోయింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఉదయం నుంచే కాన్‌బెర్రాలో వర్షం పడటంతో టాస్ పడలేదు. వరుణుడు ఎంతకీ తగ్గకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అంపైర్లు తొలి రోజు రద్దైనట్టు ప్రకటించారు. పరిస్థితులు మెరుగ్గా ఉంటే ఇరు జట్లు చెరో 50 ఓవర్ల మ్యాచ్ ఆడనున్నాయి. ఆదివారం పరిస్థితులు ఆశాజనకంగా లేవు. వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఆట సాగితే అడిలైడ్ టెస్టుకు ముందు భారత బౌలర్లకు, బ్యాటర్లకు కొంత ప్రాక్టీస్ చేయడానికి సమయం దొరికినట్టు అవుతుంది.