Asia Cup Under-19 : ఆసియా కప్ అండర్-19 మ్యాచ్ లో భారత్ టార్గెట్ 282
భారత్(India)తో జరుగుతున్న ఆసియా కప్ అండర్-19(Asia Cup Under-19) మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan)జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : భారత్(India)తో జరుగుతున్న ఆసియా కప్ అండర్-19(Asia Cup Under-19) మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan)జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటర్ షాజైబ్ ఖాన్ సెంచరీతో కదం తొక్కాడు. షాజైబ్ 147 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 159 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్ ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్, షాజైబ్ ఖాన్ ఇద్దరూ తొలి వికెట్‌కు 160 రన్స్ జోడించారు. ఉస్మాన్ ఖాన్ 60 రన్స్ చేసి మాత్రే బౌలింగ్‌లో ఔటయ్యాడు. షాజైబ్ సెంచరీతో రాణించినప్పటికి.. పాక్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు విఫలయ్యారు. భారత బౌలర్లలో నాగరాజు మూడు, మాత్రే రెండేసి వికెట్లు తీసుకున్నారు. గుహ, కిరణ్‌లకు ఒక్కొక్క వికెట్ సాధించారు.