సత్తా చాటిన భారత్.. SAFF U17 ఫైనల్ కు దూసుకెళ్లిన యువ జట్టు

SAFF U17 ఛాంపియన్‌షిప్ 2024లో భారత U17 జట్టు సత్తా చాటుతుంది. ఈ టోర్నీలో మొదటి నుంచి మంది ఫామ్ కొనసాగించిన యువ ప్లేయర్లు.. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ లోను సత్తా చాటారు.

Update: 2024-09-28 13:45 GMT

దిశ, వెబ్ డెస్క్: SAFF U17 ఛాంపియన్‌షిప్ 2024లో భారత U17 జట్టు సత్తా చాటుతుంది. ఈ టోర్నీలో మొదటి నుంచి మంది ఫామ్ కొనసాగించిన యువ ప్లేయర్లు.. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ లోను సత్తా చాటారు. నేపాల్ తో జరిగిన ఈ సెమీస్ లో 4-2 తేడాతో విజయం సాధించిన భారత జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంది. కీలకమైన సెమీస్ మ్యాచ్ లో భారత జట్టు తరపున విశాల్ యాదవ్ రెండు గోల్స్, రిషి సింగ్, హేమ నీ చుంగ్ లుంకిమ్ ఒక్కొ గోల్ సాధించారు. దీంతో భారత్ రెండు గోల్స్ తేడాతో విజయం సాధించింది. కాగా సోమవారం SAFF U17 ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఈ రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో భారత్ తలపడనుంది. కాగా ఈ రోజు రాత్రి రెండో సెమీ ఫైనల్ మ్యాచ్. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్టు మధ్య జరగనుంది. ఈ రెండు జట్లలో ఎవరు ఫైనల్ వచ్చిన భారత్ గెలవడం పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ సోమవారం జరిగే ఫైనల్ మ్యాచులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.


Similar News