ఐసీసీ అవార్డు రేసులో గిల్.. వారిద్దరితో గట్టి పోటీ
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫిబ్రవరికి సంబంధించి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫిబ్రవరికి సంబంధించి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. అవార్డు నామినీలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. గిల్‌తోపాటు ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా రేసులో ఉన్నారు. ఫిబ్రవరిలో గిల్ సంచలన ప్రదర్శన చేశాడు. ఐదు వన్డేల్లో 406 రన్స్ చేశాడు. సగటు 101.50 ఉండటం విశేషం. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో రెచ్చిపోయిన అతను వరుసగా 87, 60, 112 రన్స్ చేశాడు. అదే జోరును చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాడు. బంగ్లాదేశ్‌పై(101) అజేయ శతకం బాదగా.. పాక్‌పై విలువైన 46 పరుగులు చేశాడు. అద్భుత ప్రదర్శన నేపథ్యంలోనే గిల్ వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. మరోవైపు, గత నెలలో ఫిలిప్స్ 236 రన్స్ చేయగా.. స్మిత్ 196 పరుగులు చేశాడు.