R Ashwin : ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ.. : అశ్విన్
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జోరందుకుంది.
దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ పేరు కెప్టెన్సీ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ అంశంపై భారత్ స్పిన్ బౌలర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడాడు. ‘కోహ్లీయే ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కెప్టెన్‌గా విరాట్‌ను మించిన వారు ప్రస్తుతం ఆర్సీబీలో కనిపించడం లేదు. ఈ సారి వేలంలో ఆర్సీబీ బ్యాలెన్సింగ్‌గా ప్లేయర్లను కొనుగోలు చేసింది. పర్స్ వాల్యూ ఎక్కువగా ఉన్న ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకుంది. తమ జట్టుకు ఏం అవసరమనే దానిపై ఆ జట్టు పూర్తి అవగాహనతో ఉంది. జట్టు కూర్పు బాగుండాలని తపించింది. 12-14 మంది కీలక ఆటగాళ్లు ముఖ్యమని భావించి వేలంలో ఆచితూచి అడుగులు వేసింది.’ అని అన్నాడు. అయితే ఆర్సీబీ కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరిలో ఒకరిని కొనుగోలు చేస్తుందని భావించినా అలా జరగలేదు. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈ సీజన్‌కు ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు.