Olympics: 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో సారా హిల్డెబ్రాండ్‌కు గోల్డ్ మెడల్
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో ఫైనల్ చేరుకున్న భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ అధిక బరువు కారణంగా ఫైనల్ మ్యాచుకు డిస్‌క్వాలీఫై అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో ఫైనల్ చేరుకున్న భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ అధిక బరువు కారణంగా ఫైనల్ మ్యాచుకు డిస్‌క్వాలీఫై అయ్యారు. అనంతరం ఫైనల్ చేరుకున్న అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్ క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్ మ్యాచులో పోటీ పడింది. ఈ గోల్డ్ మెడల్ మ్యాచులో హిల్డెబ్రాండ్ 3-0తో గెలిచి బంగారు పతకం గెలుచుకుంది. దీంతొ రెజ్లింగ్‌లో రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న రెండవ అమెరికన్ మహిళగా చరిత్రలో నిలిచింది.