నాకు ఇలాగే జరిగింది.. టాయిలెట్‌లోకి వెళ్లి ఏడ్చాను : దినేష్ కార్తీక్

Update: 2023-02-21 14:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫామ్ కొల్పోయి ఇబ్బందులు పడుతున్న కేఎల్ రాహుల్‌పై భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా దారుణమైన ఫామ్‌ కొల్పోయిన రాహుల్ తన వైస్ కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జట్టులోనూ చోటు కొల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌లో రాహుల్ స్కోర్లు చూస్తే 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17, 1 గా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. దీనిపై దినేష్ కార్తీక్ స్పందిస్తూ ఒకవేళ మూడో టెస్టులో రాహుల్ చోటు కోల్పోతే దానికి కారణం ఇదొక్క ఇన్నింగ్సే కాబోదని అన్నాడు.

"రాహుల్ జట్టులో చోటు కోల్పోతే.. దానికి కారణం ఇదొక్క ఇన్నింగ్స్ కాదు. గత ఐదారు టెస్టు మ్యాచ్‌ల నుంచి ఏం జరుగుతోందో చూస్తేనే ఉన్నాం. అతడో క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలోనూ మంచి ప్లేయర్. ఆట నుంచి కొద్ది రోజులు దూరంగా ఉండాలి. వన్డేలకు ఫ్రెష్‌గా రావాలి" అని కార్తీక్ అన్నాడు.

ప్రస్తుతం రాహుల్ లాగే తాను కూడా కెరీర్లో క్లిష్టమైన దశలను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. నాకూ అలాగే జరిగింది. అలాంటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు సైలెంట్‌గా టాయిలెట్‌లోకి వెళ్లి కంటతడి పెట్టాను. ఇలాంటి పరిస్థితులలో మనం చేయగలిగేది ఏమీ లేదని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ రావడం ఖాయమని కూడా కార్తీక్ స్పష్టం చేశాడు. రాహుల్ విషయంలో బాధగానే ఉన్నా.. అతడు రానున్న రోజుల్లో మరింత బలంగా పుంజుకుని వస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News