పారాలింపిక్స్‌లో భారత్‌కు 5వ బంగారు పతకం.. ఇదే విభాగంలో సిల్వర్ కూడా కైవసం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు నిరాశ పరిచినప్పటికి.. ప్యారిస్ పారాలింపిక్స్ 2024 లో మాత్రం ఇండియా ప్లేయర్లు సత్తా చాటుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు నిరాశ పరిచినప్పటికి.. ప్యారిస్ పారాలింపిక్స్ 2024 లో మాత్రం ఇండియా ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున జరిగిన పురుషుల క్లబ్ త్రో F51లో ధరంబీర్, ప్రణవ్ సూర్మలు గెలుపొందారు. ఈవెంట్ మొదటి, రెండో స్థానంలో నిలవడం తో భారత ప్లేయర్లు.. ధరంబీర్, ప్రణవ్ సూర్మలు గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 35 ఏళ్ల ధరంబీర్ ఈవెంట్‌లో రికార్డు స్థాయిలో 34.92 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే అతని తర్వాతి స్థానంలో నిలిచిన ప్రణవ్ సూర్మ సిల్వర్ మెడల్ సాధించారు. కాగా 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశం యొక్క మొత్తం పతకాల సంఖ్య 24 కి చేరుకుంది. ఇందులో ఐదు బంగారు పతకాలు, తొమ్మిది రజత పతకాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన 2020లో టోక్యో పారాలింపిక్స్‌లో దేశం సాధించిన 19 పతకాల కంటే ఎక్కువగా ఉంది.