CSK Vs RCB: తొలిపోరులో గెలుపెవరిదో?.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

‘క్రికెట్’ దేశ ప్రజల గుండె చప్పుడు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే జెంటిల్‌మెన్ గేమ్.

Update: 2024-03-22 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ఐపీఎల్’ దేశ ప్రజల గుండె చప్పుడు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే జెంటిల్‌మెన్ గేమ్. కోట్లాది మంది భారతీయులు వేచి చూసున్న ఐపీల్-2024 ఎడిషన్ రానే వచ్చింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగబోతున్న కర్టన్ రైజర్స్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ టాస్ గెలిచి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారెల్ మిచెల్ లాంటి ప్లేయర్లతో  చెన్నై జట్టు బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆర్సీబీలో కెప్టెన్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్‌ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ఇరు జట్లు సమతూకంతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఏ జట్టు శుభారంభం చేస్తుందోనని క్రీడాభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.

తుది జట్లు ఇలా..

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్: డూప్లెసిస్ (C), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ (W.K) కరణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (C), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారెల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎస్.ఎస్ ధోనీ (W.K), దీపక్ చాహార్, మహేష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రహమాన్, తుషార్ దేశ్‌పాండే.

Tags:    

Similar News