ఇవాళ RCBతో ముంబై మ్యాచ్...ఆ డేంజర్ ప్లేయర్ వస్తున్నాడు !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ ( mumbai
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ ( mumbai indians) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్ల మధ్య ఇవాళ రసవత్తర ఫైట్ ఉండనుంది. ముంబై సొంత గ్రౌండ్ లోనే... ఈ మ్యాచ్ జరుగుతుంది. ఎప్పటి లాగే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో... ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బుమ్రా వచ్చేస్తున్నాడు!
ముంబై వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... బుమ్రా (Bumrah ) రీ- ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గాయంతో గత కొన్ని రోజులుగా ముంబైకి దూరంగా ఉన్న బుమ్రా.. తాజాగా జట్టులో చేరిపోయాడు. ఇవాల్టి మ్యాచ్ కూడా ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్ లో ఆడకపోతే... ఈ వారం చివరలో.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ( Delhi Capitals) ముంబై ఇండియన్స్ తలపడనుంది. అప్పుడైనా బుమ్రా ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ముంబై వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో బెంగళూరు 14 మ్యాచ్ లు గెలవగా ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్ లు విజయం సాధించింది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో చూడాలి.