Jasprit Bumrah : బుమ్రా మరో రికార్డు.. మూడో భారత పేస్ బౌలర్‌గా..
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 వికెట్లు పడగొట్టిన మూడో భారత పేస్ బౌలర్‌గా బుమ్రా రికార్డుకెక్కాడు.
దిశ, స్పోర్ట్స్ : ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 వికెట్లు పడగొట్టిన మూడో భారత పేస్ బౌలర్‌గా బుమ్రా రికార్డుకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. శుక్రవారం తన బర్త్ డే జరుపుకున్న బుమ్రా ఆసీస్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. అంతకు ముందు భారత బౌలర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్‌లు ఈ ఫీట్ సాధించారు. కపిల్ దేవ్ 1979లో 17 మ్యాచ్‌ల్లో 74, 1983లలో 18 టెస్ట్‌ల్లో 75 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. జహీర్ ఖాన్ 2002లో 15 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 15.20 యావరేజ్‌తో ఈ ఏడాది ఇప్పటివరకు 50 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్‌లో బుమ్రా 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.