BGT 2024 : ఆసీస్‌తో సిరీస్‌లో వాళ్లిద్దరే ‘కీ’ ప్లేయర్స్.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జైస్వాల్, బుమ్రాలు కీలక ఆటగాళ్లు అని టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జైస్వాల్, బుమ్రాలు కీలక ఆటగాళ్లు అని టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఐసీసీ రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. స్పిన్‌ను సమర్ధంగా ఆడటంతో పాటు.. బరిలోకి దిగాక విధ్వంసం చేయగల సత్తా జైస్వాల్‌కు ఉంది. మంచి ఎంటర్‌టైనర్ అయిన జైస్వాల్ భారీ స్కోర్లు చేయగల సత్తా కలిగి ఉన్నాడు. అతని పుస్తకంలో క్రికెట్‌లోని అన్ని షాట్లు ఉన్నాయి. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అనడంతో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యర్థి జట్టులో ఇద్దరు టాప్ బౌలర్లు ఉన్నారు. బుమ్రా మాత్రం బంతి మాట్లాడేలా చేయగలడు. అత్యధిక వికెట్లు సైతం పడగొట్టాడు.’ అని శాస్త్రి అన్నాడు.