రిషబ్ పంత్ విషయంలో BCCI కీలక నిర్ణయం!
కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ కోలుకోవడానికి 8 నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాత అతడు జట్టులోకి రావడానికి దాదాపు ఏడాది టైం పట్టే అవకాశం ఉంది. ఇక పంత్ త్వరగా కోలుకుని జట్టులోకి రావాలని అభిమానులు, క్రికెట్ ప్లేయర్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చికిత్స బాధ్యతంతా తీసుకున్న బీసీసీఐ పంత్‌కు మరో విషయంలో అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. గాయాలతో ఈ సీజన్‌లో ఎలాంటి మ్యాచ్‌లు పంత్ ఆడకున్నా మొత్తం జీతం ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ ప్రకారం పంత్‌కు ఏటా రూ. 5 కోట్లు లభించనుండగా.. మ్యాచ్‌లు ఆడకున్న అతనికి అందజేయనుంది. అంతేకాక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్‌కు రావాల్సిన రూ.16 కోట్లు నిబంధనల ప్రకారం జట్టు అందించాలని ఫ్రాంచైజీకి బోర్డు ఆదేశించినట్లు తెలిసింది. కాగా, ఈ ఏడాదిలో టీమిండియాకు ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఉండగా వాటికి పంత్ దూరం కానున్నాడు.
Also Read...
ముంబై ఇండియన్స్‌లో 12 సంవత్సరాలు పూర్తి Rohit Sharma ( వీడియో)