WPL : డబ్ల్యూపీఎల్ విండోను ఖరారు చేసిన బీసీసీఐ.. అప్పటి నుంచే ప్రారంభం?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ విండోను బీసీసీఐ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Update: 2024-12-19 15:18 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ విండోను బీసీసీఐ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 9 వరకు లీగ్ ప్రారంభం కానున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు నెలపాటు టోర్నీ జరగనుంది. షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ, ఫిబ్రవరి 6 నుంచి లీగ్ ప్రారంభమవుతుందని బీసీసీఐ అధికారులు ఫ్రాంచైజీలకు సమాచారం అందించినట్టు తెలిసింది.

గత రెండు సీజన్ల మాదిరిగానే 3వ సీజన్‌లోనూ 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మూడో సీజన్‌లో కొత్త జట్టును పరిచయం చేయాలని బీసీసీఐ భావించినా ఆ ఆలోచనను విరమించుకుంది. వేదిక ఇంకా ఖరారుకానప్పటికీ.. లక్నో లేదా అహ్మదాబాద్‌లలో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 9 వరకు విండో ఖరారైతే డబ్ల్యూపీఎల్ ముగిసిన వారంలోపే ఐపీఎల్ ప్రారంభంకానుంది. మార్చి 14 నుంచి ఐపీఎల్ మొదలవుతుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News