దిశ, వెబ్‌డెస్క్: చివరి టెస్టు ఆడనున్న వార్నర్ తన కెరీర్లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరో వెల్లడించాడు. సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నాడు. ‘‘నా టెస్టు కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టెయిన్. 2016-17లో గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నాకింకా గుర్తుంది. ఈ మ్యాచ్ మొదటి సెషన్లో స్టెయిన్ నిప్పులు చెరిగాడు. బౌన్సర్ల వేసి నాతోపాటు షాన్ మార్ష్‌ను కూడా భయపెట్టాడు. సెషన్లో 45 నిమిషాలపాటు మాకు చుక్కలు చూపించాడు. మార్ష్ నా దగ్గరకు వచ్చి ‘‘స్టెయిన్ బౌలింగ్‌లో ఆడలేకపోతున్నా. అతడి మనం ఎలా ఎదుర్కోవాలో నాకైతే తెలీదు’’ అని చెప్పాడు. స్టెయిన్ నా బ్యాక్‌సైడ్ ఎక్కువగా బంతులు వేశాడు. ఓ బంతి భుజానికి కూడా తగిలింది’’ అని వార్నర్ వివరించాడు.