రెజ్లింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

కిర్గిస్థాన్‌లో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి.

Update: 2024-04-13 17:08 GMT

దిశ, స్పోర్ట్స్ : కిర్గిస్థాన్‌లో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మహిళల 68 కేజీల కేటగిరీలో రాధిక రజత పతకం సాధించింది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో రాధిక 15-2 తేడాతో వరల్డ్ చాంపియన్ నొనోకా ఒజాకి(జపాన్) చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టింది. రాధికకు ఇది రెండో ఆసియా మెడల్. 2022లో 65 కేజీల కేటగిరీలో రజతం సాధించింది. మరో భారత రెజ్లర్ శివానీ పవార్ కూడా సత్తాచాటింది. 50 కేజీల కేటగిరీలో ఆమె కాంస్యం సాధించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో శివాని 9-7 తేడాతో వరల్డ్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ డోల్గోర్జావిన్ ఒట్గోంజర్గల్(మంగోలియా)ను చిత్తు చేసింది. పుష్ప(59 కేజీలు), తమన్నా(55 కేజీలు) బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. 

Tags:    

Similar News