ఆర్చరీ ఆసియా కప్‌లో భారత్‌ పతకాల పంట..

ఆర్చరీ ఆసియా కప్ స్టేజ్-2లో టోర్నీలో భారత్‌ ఆర్చరీ పతకాల పంట పండించారు.

Update: 2023-05-05 13:12 GMT

తాష్కెంట్: ఆర్చరీ ఆసియా కప్ స్టేజ్-2లో టోర్నీలో భారత్‌ ఆర్చరీ పతకాల పంట పండించారు. శుక్రవారం ఒకే రోజు 12 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో 7 స్వర్ణాలు ఉండగా.. మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. ఉమెన్స్ కాంపౌంట్ కేటగిరీ ఫైనల్‌లో ప్రగతి, పర్నీత్ కౌర్, రాగిణి‌లతో కూడిన భారత్ టీమ్ 231-223 తేడాతో కజకస్థాన్‌పై,, పురుషుల కాంపౌండ్ కేటగిరీలో భారత త్రయం (అభిషేక్, కుషాల్ దలాల్, అమిత్‌) 233-227 తేడాతో హాంకాంగ్‌పై నెగ్గి విజేతగా నిలిచాయి. అలాగే, కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో పర్నీత్ కౌర్, అభిషేక్ ద్వయం 157-145 తేడాతో కజకస్తాన్‌ను చిత్తు చేసి భారత్‌కు మరో స్వర్ణం అందించింది.

పురుషుల రికర్వ్ టీమ్‌లో జయంత్, మృణాల్ చాహౌన్, తుహార్ జట్టు 5-1 తేడాతో చైనాను ఓడించి స్వర్ణ పతకం సాధించగా.. మహిళల విభాగంలో సంగీత,మధు వేద్వాన్, తనీషా వర్మ 0-6 తేడాతో చైనా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టింది. ఇక, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో సంగీత, మృణాల్ చౌహాన్ ద్వయం 4(20)-4(18) తేడాతో చైనాను షూటౌట్‌లో ఓడించి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ 143(10)-143(9) తేడాతో షూటౌట్‌లో సహచరుడు అమిత్‌పై నెగ్గి స్వర్ణం గెలుచుకోగా.. మహిళల విభాగంలో రాగిణి మార్కో 144(10*)-144(10) తేడాతో మరో భారత అథ్లెట్ ప్రగతిపై గెలిచి విజేతగా నిలిచింది. ఇక, బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌ల్లో పురుషుల విభాగంలో కుషాల్, మహిళల విభాగంలో పర్నీత్ కౌర్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.

Tags:    

Similar News