స్క్వాష్‌లో మ‌రో సంచ‌ల‌నం.. అండ‌ర్ 19 ట్రోఫీ గెలుపొందిన అన‌హ‌త్ సింగ్

Update: 2023-12-31 08:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: భార‌త యువ‌ కెర‌టం అన‌హ‌త్ సింగ్ మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. ఈమ‌ధ్యే 19వ ఆసియా గేమ్స్‌లో ప‌త‌కంతో వార్తల్లో నిలిచిన ఆమె అండ‌ర్-19 అమ్మాయిల జూనియ‌ర్ ఓపెన్ స్క్వాష్ పోటీల్లో విజేత‌గా అవ‌త‌రించింది. స్కాంట్లాండ్ వేదిక‌గా జ‌రిగిన ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో అన‌హ‌త్ త‌న ఫేవ‌రేట్ రాబిన్ మెక్అల్‌పైన్‌ను మ‌ట్టిక‌రిపించింది. తొలి సెట్ నుంచి ఆధిపత్యం చెలాయించిన అన‌హ‌త్ 11-6, 11-1, 11-5తో విజ‌యం సాధించింది. అండ‌ర్- 13 ఫైన‌ల్లో టాప్ సీడ్ ఆద్యా బుదియా మ‌లేషియాకు చెందిన నీహియా చ్యూపై గెలుపొందింది. అండ‌ర్ -15లో సుభాష్ చౌద‌రీ 5-11, 11-4, 6-11, 11-8, 11-5తో భార‌త్‌కే చెందిన శివేన్ అగ‌ర్వాల్‌ను ఓడించాడు. అండ‌ర్ -13 ఫైన‌ల్లో శ్రేయ‌స్ అయ్యర్ 11-8, 11-8, 3-11, 11-8తో శ్రేయాన్షు జ‌య్‌ను చిత్తు చేశాడు.


Similar News