Ambati Rayudu : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్
ఇటీవల ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. తాజాగా టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. తాజాగా టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని మంగళవారం ట్విట్టర్ వేదికగా రాయుడు ప్రకటించాడు. అండర్-15 నుండి అత్యున్నత స్థాయి వరకు నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా రాయుడు భావోద్వేగ లేఖ రాశాడు. ఇన్నాళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకరించిన బీసీసీఐ, జట్టు సిబ్బంది, స్టాఫ్, కెప్టెన్లు, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్‌లో తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్‌లకు సైతం ఈ స్టార్ బ్యాటర్ ధన్యవాదాలు తెలిపాడు.
"నా క్రికెట్ కెరీర్‌ను ఆరుసార్లు ఐపీఎల్ విజేతగా ముగించినందుకు గర్వపడుతున్నాను.. 2013లో ముంబై ఇండియన్స్ తరుఫున తొలి ఐపీఎల్ టైటిల్ సాధించడంలో భాగమైనందుకు.. అలాగే 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగస్వామ్యం అయ్యి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు, 2023 సంవత్సరం ఐపీఎల్ సీజన్ నాకు ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలు. కెప్టెన్ ధోనీ భాయ్‌తో, CSK మరియు టీమ్ ఇండియాలో కలిసి ఆడడం కూడా గొప్ప అదృష్టం. గత రెండు దశాబ్దాలుగా గ్రౌండ్‌లో,వెలుపల కొన్ని గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో 2023 ఐపీఎల్ ఫైనల్ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది" అని అంబటి రాయుడు భావోద్వేగ లేఖ పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి :