జింబాబ్వేపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఐదు టీ-20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా హరారే స్టేడియం వేదికగా ఆదివారం జింబ్వాబే, భారత్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్
దిశ, వెబ్‌డెస్క్: ఐదు టీ-20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా హరారే స్టేడియం వేదికగా ఆదివారం జింబ్వాబే, భారత్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జింబ్వాబే బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 47 బంతుల్లోనే మెరుపు సెంచరీ (100) చేశాడు. 47 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లు బాది అభిషేక్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఓడిన కసితో ఉన్న అభిషేక్ వచ్చిన బౌలర్‌ను వచ్చినట్లు ఉతికారేశాడు. అభిషేక్ మెరుపు సెంచరీతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో రింకు సింగ్, గైక్వాడ్ ఉన్నారు. సిరీస్ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాకిచ్చిన జింబాబ్వేపై టీమిండియా ఆటగాళ్లు కసి తీర్చుకుంటున్నారు. ఇక, మెరుపు సెంచరీతో భారత్ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్.. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. దీంతో అభిషేక్‌కు టీమిండియాలో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని అభిషేక్ రెండు చేతులా వినియోగించుకుంటున్నాడు.