చిన్నారులకు గిఫ్ట్‌గా స్మైల్.. సచిన్ ఫౌండేషన్‌పై మాస్టర్ బ్లాస్టర్ స్పెషల్ ట్వీట్ (వీడియో)
ఇండియన్ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా తన ఫౌండేషన్ ద్వారా అందుతున్న సేవలను రివీల్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా తన ఫౌండేషన్ ద్వారా అందుతున్న సేవలను రివీల్ చేశారు. జమ్ము కశ్మీర్ లో భార్య, కూతురితో సచిన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వైకల్యాలతో జన్మించిన పిల్లలకు తన ఫౌండేషన్ సాయం అందిస్తుందని తెలిపారు. మన దేశంలో ప్రతి ఏడాది సుమారు 60 వేల మంది వివిధ రకాల వైకల్యాలతో జన్మిస్తున్నారని సచిన్ తెలిపారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల మొఖల్లో నవ్వులు నింపడానికి నిపుణులైన వైద్య బృందంతో సేవలు అందిస్తున్నామన్నారు. చీలిక పెదవి, అంగిలి శస్త్రచికిత్సల ద్వారా పిల్లల ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మేము సపోర్టు చేస్తున్న కేంద్రాలలో ఒకటి శ్రీనగర్‌లో ఉందని పేర్కొన్నారు. తమ జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా, మేము ఇంగా హెల్త్ ఫౌండేషన్ ఆసుపత్రిలో వైద్యులు, పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో ముచ్చటించామన్నారు. శస్త్రచికిత్స ఈ పిల్లల జీవితాలను ఎలా మార్చిందో కథలు వినడం నిజంగా సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ చిన్న హీరోలను కలిసిన తర్వాత అంజలి, సారా మరియు నేను అందరం నవ్వుకున్నామన్నారు. వారి జీవితాల్లో ఈ అందమైన మార్పునకు సహకరించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవతున్నామన్నారు. ఇక, సచిన్ ట్విట్టర్ పోస్ట్ చేసిన ఫాన్స్ సచిన్ రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నారు. చిన్నారుల ఫేస్‌లో నవ్వు నింపాలని మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.