Olympics: 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అవిరి చేసిన 100 గ్రాముల అధిక బరువు

పారిస్ 2024 ఒలింపిక్స్ అధికారికంగా జూలై 26, శుక్రవారం సెయిన్ నదిపై చారిత్రాత్మక ప్రారంభ వేడుకతో ప్రారంభమయ్యాయి.

Update: 2024-08-07 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ 2024 ఒలింపిక్స్ అధికారికంగా జూలై 26, శుక్రవారం సెయిన్ నదిపై చారిత్రాత్మక ప్రారంభ వేడుకతో ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటి వరకు అనేక ఈవెంట్లలో భారత ప్లేయర్లు సెమీస్ వరకు వెళ్లి పతకం సాధించకుండానే వెనుదిరిగి వెళ్లగా.. షూటింగ్ లో మాత్రం మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాదించింది. అలాగే షూటింగ్ లోనే మరో కాంస్య పతకం రావడంతో మొత్తం మూడు కాంస్య పతకాలను మాత్రమే సాధించింది. అయితే భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె ఓవర్ వెయిట్ కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో ఫైనల్ మ్యాచ్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని 140 కోట్ల మంది భారతీయులు వినేశ్ ఫొగట్‌ ఆశలు పెట్టుకున్నారు. కానీ కేవలం 100 గ్రాముల అధిక బరువు 140 కోట్ల భారతీయులు గోల్డ్ మెడల్ ఆశలను ఆవిరి చేసింది. దీంతో భారతీయులు గుండె పగిలిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Similar News