కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఒకరు మృతి

దిశ, శేరిలింగంపల్లి : అతివేగంతో స్పోర్ట్స్ బైక్ పై దూసుకు వచ్చిన యువకులు యూ టర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలైన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బోరబండ వివేకానంద నగర్ లో నివాసం ఉండే గణేష్, చైతన్య వర్మ, తన పెద్దనాన్న వద్ద ఉంటూ ఉన్నత చదువులు చదువుతున్నారు. శనివారం రాత్రి సమయంలో బయటకు వెళ్తున్నామని చెప్పి తమ […]

Update: 2021-10-02 11:50 GMT

దిశ, శేరిలింగంపల్లి : అతివేగంతో స్పోర్ట్స్ బైక్ పై దూసుకు వచ్చిన యువకులు యూ టర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలైన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బోరబండ వివేకానంద నగర్ లో నివాసం ఉండే గణేష్, చైతన్య వర్మ, తన పెద్దనాన్న వద్ద ఉంటూ ఉన్నత చదువులు చదువుతున్నారు. శనివారం రాత్రి సమయంలో బయటకు వెళ్తున్నామని చెప్పి తమ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైక్ పై ఇంటి నుండి బయలుదేరారు. వివేకానంద నగర్ కాలనీ నుండి ఎన్ఐఏ వైపు వెళ్లే కొత్త రోడ్డులో విష్ణు విస్తార ఆపార్టమెంట్ ఎదురుగా గల యూ టర్న్ వద్ద టర్న్ చేస్తున్న కారును పర్వతానగర్ వైపు నుండి అతి వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్ బైక్ బైక్ ఢీ కొట్టింది.

ఈ ఘటనలో బైక్ నడుపుతున్న గణేష్ తీవ్రంగా గాయపడగా.. వెనుక కూర్చున్న అతని సోదరుడు చైతన్య వర్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గణేష్ ను దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కియా కారు డ్రైవర్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మాదాపూర్ పోలీసులు. మృతుడు శంకర్ పల్లెలో ఉన్న ఐబీఎస్ కాలేజీలో బీబీఎం చదువుతుండగా, గాయపడిన గణేష్ పంజాగుట్టలోని అమిటీ కాలేజీలో బీబీఎం చదువుతున్నాడు. వీరి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు మండలంలోని మలికీపురం అని తెలుస్తోంది.

Tags:    

Similar News