ఆ రెండు నెలలు జీతాలు రావు.. కానీ!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పైస్ జెట్ తమ పైలట్‌లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్, మే నెలలకు జీతాలను చెల్లించలేమని స్పష్టం చేసింది. అయితే, కార్గో విమానాలను నడిపే పైలట్లు అందరికీ సరుకు రవాణా చేసే పని దొరికేలా చూస్తామని హామీ ఇచ్చింది. ప్రతి పైలట్‌కు కార్గో విమనాల ద్వారా గంటల ప్రకారం వేతనం ఇస్తామని వెల్లడించింది. తమ పైలట్లు కనీస వేతనం అందుకునేలా కార్గో విమానాలను నడిపే అవకాశం ఇస్తోంది. కరోనా వల్ల అత్యంత […]

Update: 2020-04-29 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పైస్ జెట్ తమ పైలట్‌లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్, మే నెలలకు జీతాలను చెల్లించలేమని స్పష్టం చేసింది. అయితే, కార్గో విమానాలను నడిపే పైలట్లు అందరికీ సరుకు రవాణా చేసే పని దొరికేలా చూస్తామని హామీ ఇచ్చింది. ప్రతి పైలట్‌కు కార్గో విమనాల ద్వారా గంటల ప్రకారం వేతనం ఇస్తామని వెల్లడించింది. తమ పైలట్లు కనీస వేతనం అందుకునేలా కార్గో విమానాలను నడిపే అవకాశం ఇస్తోంది. కరోనా వల్ల అత్యంత భారీగా నష్టపోయింది ఎయిర్‌లైన్స్ రంగమేనని, తమ పైలట్లు కార్గో విమానాలను నడపడం ద్వారా గంటల చొప్పున వేతనాన్ని పొందే సౌకర్యం ఇవ్వనున్నట్టు సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం స్పైస్ జెట్ 5 కార్గో(సరుకు రవాణా) విమానాలను కలిగి ఉంది. వీటిని ఉపయోగించి ఇండియాలోనూ, విదేశాల్లోనూ వైద్య,ఆహార వంటి సరుకులను రవాణా చేస్తున్నారు. అదనంగా సరుకుల రవాణా కోసం ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ బోయింగ్ 737, క్యూ400 లను కూడా వినియోగించనుంది. వీటిని నడపడం ద్వారా తమ పైలట్లకు గంట ప్రకారం వేతనాలు అందించి వారిని ఆదుకోవాలని భావిస్తోంది.

ఈ అంశంపై చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ అధికారి గురుచరణ్ పైలట్‌లకు రాసిన లేఖలో స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్, మే నెలలకు మనకు జీతాలు రావనీ, రానున్న వారాల్లో సరుకుల రవాణా చేయడానికి విమానాల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. మన బృందం ఎయిర్‌క్రాఫ్టులు నడిపే అవకాశం వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి పైలట్‌కు కొంత సమయం మాత్రమే పని చేసే అవకాశం లభిస్తుందని, దీనివల్ల మన నైపుణ్యం చెదరకుండా ఉండొచ్చని ఆయన లేఖలో తెలిపారు. ఇటీవల స్పైస్ జెట్ సంస్థ క్యాబిన్ క్రూ సిబ్బంది జీతాన్ని 30 శాతం తగ్గించింది. ఈ ఏడాది ప్రమోషన్లు ఉండవని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో తాజా ఆఫర్ ప్రకారం పైలట్‌లు అందరికీ 25 గంటల చొప్పున లెక్కించి చెల్లింపులు నిర్వహించవచ్చని తెలుస్తోంది. కరోనాకు ముందు ఫిక్స్‌డ్ శాలరీ 50 గంటలుగా ఉండేది. తక్కువగా నిర్ణీత 50 గంటలకు రూ. 36 వేల ప్రాథమిక వేతనం ఉండేది. ప్రస్తుతం దీన్ని రూ. 29 వేలకు తగ్గినట్టు సమాచారం. లాక్‌డౌన్ వల్ల ఎక్కువమంది సిబ్బందిని జీతం లేని సెలవులపై పంపించినట్టు స్పైస్ జెట్ సీఎమ్‌డీ అజ్య సింగ్ వెల్లడించారు.

Tags: SpiceJet, cargo pilots, paid on hourly basis, coronavirus, covid-19

Tags:    

Similar News