కాటారంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
దిశ, కాటారం: ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నది కాటారం మండల పరిషత్ కార్యాలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలిసారిగా కాటారం మండల పరిషత్ భాగస్వామ్యంతో డాక్టర్ శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ ఎల్ ఎల్ పి హన్మకొండ ఆధ్వర్యంలో బుధవారం కాటారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో భారీ ఎత్తున ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి కాటారం సబ్ డివిజన్ […]
దిశ, కాటారం: ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నది కాటారం మండల పరిషత్ కార్యాలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలిసారిగా కాటారం మండల పరిషత్ భాగస్వామ్యంతో డాక్టర్ శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ ఎల్ ఎల్ పి హన్మకొండ ఆధ్వర్యంలో బుధవారం కాటారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో భారీ ఎత్తున ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి కాటారం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు నేత్ర వైద్య సహాయం కొరకు తరలివచ్చారు. కాటారం ఎంపీపీ సమ్మయ్య, ఎంపీడీవో ఆంజనేయులు, మల్లికార్జునరెడ్డిలు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు విశేష కృషి చేశారు. వీరి అంచనాలను తారుమారు చేస్తూ భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుండి స్పందన బాగా లభించడంతో నిర్వాహకులతోపాటు శరత్ మాక్స్ విజన్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, మహేష్ రవీందర్రావు, హాస్పిటల్ కు చెందిన ప్రవీణ్ కుమార్, గ్రామ కార్యదర్శి శగిర్ఖాన్ పాల్గొన్నారు.